Oopiri – Heartfelt Experience

imageThis is an emotional experience from Praveen Veluvolu, my God given thammudu, which I have saved it since its inscription with an intention to treasure it as a keepsake by publishing in my blog. Thanks Praveen for allowing me to post it.

This is one movie that is universally accepted by everyone. I haven’t heard any negative comments or criticism on this movie (everyone has only high acclaim for it) – universally people loved this movie. Proud to be Nagarjuna’s admirer on any day ❤

Here it is …

సినిమా చూస్తూ ఏడవటం ఏంటి అనుకునే వాడిని…. కాని కొన్ని సినిమాలు నన్ను కదిలించాక ఓహ్ నిజమే సినిమాలు ఎడిపిస్తాయ్ అని నమ్మాను…

గతం లో నా కళ్ళు తడిచిన సినిమాలు అప్రస్తుతం కాని… ఇప్పుడే చుసిన ఊపిరి నిజం గా మూస ధోరణి లో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా ని బతికించే ఒక ఊపిరి

ఇలాంటి ఒక కథ ని నమ్మే స్టార్ హీరో నాగార్జున ఐతే ఆయన నమ్మకాన్ని నమ్మిన పి వి పి మరొక ఊపిరి

ఊపిరి ని కరెక్ట్ గా చెప్పాలంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ… జన్యూన్ ఎమోషన్స్…జన్యూన్ నటన…జన్యూన్ మ్యూజిక్….జన్యూన్ రి రికార్డింగ్…. ప్రతిదీ జన్యూన్ గా ఉన్న ఒక్క ఒక జన్యూన్ సినిమా

ప్రేమ కథ అని దేనికి అన్నాను అంటే

ఇద్దరు స్నేహితుల ‘ఉండే ప్రేమ’ కథ
ఒక కొడుకు తల్లి మధ్య ‘ఉండే ప్రేమ’ కథ
ఒక అన్న చెల్లి మధ్య ‘ఉండే ప్రేమ’ కథ
మంచి మనసుల మధ్య ‘ఉండే ప్రేమ’ కథ

నేను ఇంటచబుల్స్ చూసినప్పుడు అనుకున్నా తెలుగు లో వర్క్ ఔట్ అవ్వదు కాని చేస్తే మా నాగ్ చెయ్యాలి అనుకున్నా…. నా ఊహ కి ఊపిరి ఇస్తూ నిజం చేస్తూ ఈ సినిమా అనౌన్సమెంట్ వచ్చింది

నాగార్జున ఈ సినిమా లో విక్రమాదిత్య పాత్ర లో పరకాయ ప్రవేశం చేశారు….ఇంత సటిల్ గా ఆయన మాత్రమె చెయ్యగలరు…

మెడ కింద మొత్తం పనిచేయని ఆ పాత్ర కి కేవలం మొహం, కళ్ళు మాత్రమె నటించాలి… కాని ఆయన విశ్వరూపం చూపించారు…

కార్తీ ఈ సినిమా కి అతి పెద్ద ఎస్సెట్…. అమాయకత్వం,అల్లరి తనం,పోకిరి అన్ని కలిపిన ఈ పాత్ర లో చెలరేగిపోయాడు

ప్రకాష్ రాజ్ ని ఇంత మంచి పాత్ర లో చూసి చాన్నాళ్ళు అయ్యింది

తమన్నా సూపర్…. మొదటి సారి యాక్ట్ చేసింది

అనూష్క కాకపొతే ఆ రోల్ కి అంత డిగ్నిటి రాదు

జయసుధ టాప్ క్లాస్

సాంగ్స్ ప్లేస్మెంట్ బావుంది… Background Music ఈ సినిమా స్థాయి ని పెంచింది…

విజువల్ గా ఇంత గ్రాండ్ గా ఉన్నా సినిమా తెలుగు లో ఈ మధ్య కాలం లో రాలేదు…

వంశీ పైడిపల్లి ఈ కథ ని తెలుగు నేటివిటీకి మార్చిన విధానం అద్భుతం…. ఎమోషన్డ్ ఫెచ్ చేసిన విధానం అద్భుతం….దర్శకుడు గ చాల మెట్లు ఎక్కేసాడు….

ఊపిరి అనే ఈ సినిమా ని మిస్ ఐతే మీరు జన్యునిటి ని మిస్ అయినట్టే… ఈ సినిమా మీకు నచ్చి తీరుతుంది…. మీరు కులం మతం ప్రాంతం లాంటి పొరలతో మీ కళ్ళను కప్పేసుకుంటే తప్ప

ఊపిరి తప్పక చూడండి….. పల్లెటూరిలో పౌర్ణమి రాత్రి పొలం మధ్యలో నులక మంచం వేసుకుని వేడి వేడి అన్నం లో ఆవకాయ కలుపుకుని తింటుంటే ఎంత హాయి గా ఉంటుందో అంత హాయి గా ఉంటుంది ఈ ఊపిరి… అప్పుడు ఎంత స్వచ్ఛం అయిన గాలి పీలుస్తారో అంత స్వచ్ఛం అయిన సినిమా ఊపిరి…అప్పుడు ఎంత ప్రశాంతం గా ఉంటారో అంత ప్రశాంతం అయిన సినిమా ఊపిరి..

నాగార్జున అభిమాని గా నా జన్మ ధన్యం ధన్యం ధన్యం…

Say it Loud HAIL THE KING!!

Say it Again HAIL THE KING!!

Say one more time HAIL THE KING!!

Advertisements

One thought on “Oopiri – Heartfelt Experience

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s